పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్‌కు గనులను కేంద్ర…
ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్…
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్‌గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బీజేపీ నుంచి నేతలు వెళ్లిపోకుండా ‘ఢిల్లీ టూర్’! తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు.…
విశాఖ ఉక్కు ఉద్యమం నానాటికి తీవ్ర రూపు దాలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనలు చేసినా, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో… ఆందోళనలను ఢిల్లీకి చేర్చారు కార్మిక సంఘాల నాయకులు. ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ, మద్దతు కూడగడుతున్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ బయలుదేరిన వేలాదిమంది కార్మికులు… హస్తినలోనే అమీతుమీ తేల్చుకుంటామంటున్నారు. ఎవరో ఇస్తే విశాఖ ఉక్కు రాలేదని. 32 మంది అమరవీరుల త్యాగఫలమని, 64 గ్రామాలు, 26 వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన…
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే…
ఢిల్లీకి కొత్త పోలీస్ కమీషనర్‌గా రాకేష్ ఆస్థానాను కేంద్రం నియమించింది. రాకేష్ ఆస్థానాను కమీషనర్‌గా నియమించడంపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని భయపెట్టేందుకు, పార్టీ నేతలను, పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చేసేందుకు రాకేష్ ఆస్థానాను వాడుకుంటుందని ఆప్ విమర్శించింది. రాకేష్ ఆస్థానా స్థానంలో మరోకరిని నియమించాలని కోరుతూ ఢిల్లీ శాసనసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖలకు పంపించనున్నారు. సాధారణంగా రాష్ట్రాలకు పోలీస్ శాఖల అధిపతులుగా డీజీపీలు ఉంటారు.…
వారిద్దరిదీ ఒకే గ్రామం… కాకపోతే వేరువేరు కులాలు. మనసులు కలవడంతో ప్రేమించుకున్నారు. గ్రామం నుంచి ఢిల్లి వెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఏడాది కాలంగా ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే, యువతి గర్భం దాల్చడంతో ఇద్దరూ సొంత గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి తిరిగి వచ్చిన వీరికి ఊహించని బహుమానం లభించింది. గ్రామంలోకి అడుగుపెట్టాలంటే పంచాయతీకి రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టాలని, జరిమానా కట్టకుంటే గ్రామంలోకి అడుగు పెట్టనివ్వమని పంచాయతీ పెద్దలు తీర్పు ఇచ్చారు. యువకుడు లడ్డూసింగ్ తండ్రి యువతి…
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్ స్పైవేర్ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు..…