మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు.…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా ? అనే అనుమానం రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సోనూసూద్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం ఈ చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో సోనూసూద్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగింది. సోనూ సూద్, సిఎం కేజ్రీవాల్ భేటీకి రాజకీయ రంగు అద్దుతున్నారు. ఈ సమావేశాన్ని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్ మ్యాప్ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్ పైప్లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు…
యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయోధ్యలో ఉన్న మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ఎయిర్‌పోర్టుకు సమీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను నిర్మించబోతున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌కు అప్పగించారు. ఈ సంస్థ అధికారులు ఇటీవలే ఆయోధ్యవెళ్లి అక్కడ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చలు…
దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి.. కుండపోత వర్షం దెబ్బకు వీధులు, రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఈ రోజు ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. 13 ఏళ్లలో ఆగస్ట్ నెలలో ఒకే రోజు అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఈ భారీ వర్షంతో దేశ రాజధానిలో ఆరెంజ్ హెచ్చరిక జారీ…
తాలిబన్లు ఎంతటి కర్కశకులో చెప్పనలివి కాదు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. జాలి, దయ అన్నవి వారి నిఘంటువులో కనిపించవు. తెలిసందల్లా రక్తపాతం సృష్టించడం, ప్రజలకు భయపెట్టడం. బయటిప్రజలతోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డలతో కూడా వారి ప్రవర్తన అలానే ఉంటుంది. దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డలను తీసుకొని పొట్ట చేత్తోపట్టుకొని ఇండియా వచ్చింది ఫరిభా అనే మహిళ. ఆఫ్ఘన్లో ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో…
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.. ఆయన దివంగత భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాలను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయనకు నిర్ధోషిగా ప్రకటించింది… కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడినట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో…
కాబూల్ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్ ఎయిర్ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన…
సుప్రీంకోర్టు ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది… ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్ డి వద్ద మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో.. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు.. మంటలు అంటుకున్న తర్వాత.. సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు యత్నంచారు.. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇక, వెంటనే స్పందించిన పోలీసులు.. మంటలను ఆర్పివేశారు. గాయాలపాలైన ఆ ఇద్దరనీ ఆస్పత్రికి తరలించారు.. మహిళలకు తీవ్ర గాయాలు కాగా.. పురుషుడి కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం…