పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్‌పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో…
కరోనా మహమ్మారితో స్కూళ్లు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు.. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకపోగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. ఇప్పట్లో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.. కొన్ని రాష్ట్రాలకు క్లాసుల నిర్వహణకు సిద్ధం అయినా.. థర్డ్ వేవ్ వార్నింగ్‌లతో వెనక్కి తగ్గారు.. అయితే, ఇప్పట్లో భౌతికంగా తరగతులు నిర్వహించలేమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కరోనా థర్డ్ వేవ్…
రాహుల్ గాంధీ.. త్వరలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది.. అయితే, ఆ బాధ్యతలను ప్రస్తుతానికి సోనియా గాంధీ చూస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అనూహ్యంగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు.. ఇక, ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో.. అధ్యక్ష బాధ్యతల కంటే ముందుగా మరో కీలక పదవి కట్టబెట్టడానికి అధిష్ఠానం రెడీ అయినట్టు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి…
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా అన్నారు.. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని తెలిపారు ఈటల రాజేందర్.. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల.. షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని.. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని వెల్లడించారు.. ఇక, ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా..…
ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు.…
సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై కన్నేసింది. పంజాబ్ రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తన ముద్రను వేసుకోవాలని చూస్తోన్నది ఆప్. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ఆప్, ఇప్పుడు మరో వంద యూనిట్లు పెంచింది. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌తో పాటుగా ఉత్తరాఖండ్‌పై కూడా ఆప్ కన్నేసింది. కేజ్రీవాల్…
దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ సెల్ పోలీసులు.. 2,500 కోట్ల రూపాయల విలువైన 354 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ ముఠాలో ఒకరు ఆప్ఘనిస్థాన్ జాతీయుడు. పంజాబ్ నుంచి ఒకరు, కాశ్మీర్ నుంచి ఒకరు.. మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి.…