ఢిల్లీలోని అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకు ఓ సీక్రెట్ సొరంగమార్గం ఉన్నది. ఈ సొరంగ మార్గాన్ని గురువారం రోజున మరోసారి గుర్తించారు. బ్రిటీష్ కాలంలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ మార్గం ద్వారా ఎర్రకోటకు తరలించేవారని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని కోర్టుగా వినియోగించేవారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ పేర్కొన్నారు. 1993 లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదటిసారి ఈ సొరంగమార్గం గురించి విన్నానని, అయితే, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా పూర్తి సమాచారం దొరకలేదని అన్నారు. 1912లో రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని తరలించిన తరువాత మొదట ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీని లెజిస్లేటీవ్ అసెంబ్లీగా వినియోగించారని, ఆ తరువాత 1926 నుంచి కోర్టుగా మార్చారని, ఆ సమయంలో ఈ సొరంగం ద్వారా స్వాతంత్య్ర సమరయోధులను ఎర్రకోట నుంచి కోర్టుకు తీసుకెళ్లేవారని స్పీకర్ గోయల్ పేర్కొన్నారు.
Read: