సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆరోరోజుకు చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సహా పదికి పైగా కీలకాంశాలను కేంద్రం ముందుంచారు సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలోనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించనున్నారు సీఎం కేసీఆర్. కృష్ణా జలాల్లో వాటాల పంపిణీ అంశాన్ని సైతం ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశముంది. ఇప్పటికే ప్రధాని మోడీతో సమావేశంలో ఐపీఎస్‌ల కేటాయింపు సహా కీలకాంశాలను ప్రస్తావించారు సీఎం. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. తెలంగాణ భవన్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలన్నారు .దీనికి తోడు రాష్ట్ర సమస్యలను సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.