ఢిల్లీలో కేసీఆర్ వరుస భేటీలు…నేడు కూడా అక్కడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు.
నిన్న గజేంద్రసింగ్ షెకావత్‌తోనూ, నితిన్ గడ్కరీతోనూ ఆయన సమావేశమయ్యారు. జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో… జల వివాదాలతో పాటు అనేక అంశాలపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌పై… తమ అభ్యంతరాలను షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Also Read
కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఉపసంహరణ దరఖాస్తు కూడా దాఖలు చేశామని చెప్పారు. అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కావాలని షెకావత్‌ను కోరారు… కేసీఆర్. కృష్ణా నదిపై అనుమతిలేకుండా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని… ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితిని… షెకావత్‌కు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారట. ఇక ఇవాళ మరికొంత మంది మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?