తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల జల వివాదాలు, కేంద్ర గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా భవనం ఏర్పాటు స్థలాన్ని కేటాయించాలని మోడీని కేసీఆర్ కోరారు. ఈ అభ్యర్థనలకు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం అక్టోబర్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఇక రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.