Rekha Gupta: రేఖా గుప్తాను పరామర్శించిన బీజేపీ ఎంపీలు.. దాడి తర్వాత సీఎం ఫొటో విడుదల
- రేఖా గుప్తాను పరామర్శించిన బీజేపీ ఎంపీలు
- దాడి తర్వాత సీఎం ఫొటో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు పరామర్శించారు. ఈ సందర్భంగా క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. త్వరలోనే తిరిగి ప్రజలను కలుస్తారని ఎంపీలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్‌కుమార్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
బుధవారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా జనసభ నిర్వహిస్తుండగా.. గుజరాత్‌కు చెందిన జంతు ప్రేమికుడు సకారియా అకస్మాత్తుగా దాడి చేశారు. రేఖా గుప్తా చెంపపై కొట్టి దుర్భాషలాడాడు. దీంతో రేఖా గుప్తాకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఇంట్లోనే చికిత్స అందించారు. ఇంకోవైపు నిందితుడు సకారియాను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఖండించారు.
అసలేం జరిగిందంటే..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో నిందితుడు రాజేష్ సకారియా పోలీస్ విచారణలో వింతైన విషయాలు వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని చెప్పుకొచ్చాడు. వీధి కుక్కల విషయంలో తనను ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయం కోరమని శివుడు చెప్పాడని పేర్కొన్నాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరితే పట్టించుకోలేదన్నాడు. అందుకే ఆమెపై దాడి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన
ఢిల్లీ వీధుల్లో 8 వారాల్లో వీధి కుక్కలను తొలగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. తీర్పు అనంతరం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గుజరాత్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేష్ సకారియాకు కోపం తెప్పించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న అతడు.. హుటాహుటినా ఢిల్లీకి వచ్చాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరాడు. బుధవారం ఆమెకు వినతిపత్రం ఇచ్చాడు. అందుకు ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. అంతేకాకుండా దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అయితే సకారియా చెప్పిన దైవిక జోక్య సిద్ధాంతాన్ని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తోసిపుచ్చారు. కుక్కల విషయంలో దైవ జోక్యం ఉండదన్నారు. ఈ సిద్ధాంతం పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందన్నారు. అతడొక ప్రొఫెషనల్ నేరస్థుడని పేర్కొన్నారు. వాస్తవాల నుంచి దృష్టిని మళ్లించడానికే యాదృచ్ఛిక సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు. సకారియాపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిలో ఎక్కువ భాగం మద్యం అక్రమ రవాణాకు సంబంధించినవి ఉన్నట్లు చెప్పారు. వీటిలో అనేక కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడని చెప్పారు. అయితే ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. శారీరకంగా గాయాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే గుజరాత్ నుంచి టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించినట్లు సకారియా చెప్పాడు. ఢిల్లీ చేరుకున్నాక.. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్కడ ఉంటారని ప్రజలను వాకబు చేశాడు. అనంతరం మెట్రోలో ప్రయాణం చేశాడు. కానీ వేరే స్టేషన్‌లో తప్పుగా దిగిపోయాడు. అనంతరం షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి సైకిల్ రిక్షాలో చేరాడు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి తిరిగి రాత్రి గుజరాత్‌కు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు సకారియా పోలీసులకు చెప్పాడు. కానీ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చి వెంటనే వాగ్వాదం పెట్టుకున్నాడు. దుర్భాషలాడాడు. ప్రస్తుతం సకారియాపై హత్యాయత్నం, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నందుకు ఇతర సెక్షన్లతో పాటు అనేక అభియోగాలు మోపారు.
आज मैंने अपने दिल्ली के सभी साथी सांसदों के साथ दिल्ली की लोकप्रिय मुख्यमंत्री श्रीमती @gupta_rekha जी से भेंट कर उनका कुशलक्षेम जाना।
मुख्यमंत्री जी पूर्णतः स्वस्थ हैं और पहले की तरह दिल्लीवासियों के कार्यों में निरंतर तत्परता से जुटी हुई हैं। pic.twitter.com/lCwFQZiELc
— Praveen Khandelwal (@PKhandelwal_MP) August 21, 2025
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!