దేశంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం బయటికి వచ్చేవాళ్లే లేరు.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు…
ఢిల్లీ పోలీసులు తన కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై రాజధానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవోపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు..ఈ సంఘటన సెప్టెంబర్ 14, 2023 నాటిది, ఇది ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిందని PTI నివేదకలో పేర్కొంది.. శనివారం రాత్రి, భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరుడు చేసిన ఫిర్యాదు మేరకు చాణక్యపురి పోలీస్ స్టేషన్లో ఇండియన్…
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా…
ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు.…
తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా…
Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతో భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఢిల్లీతో పాటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మన దేశంతో పాటు పాకిస్తాన్ కూడా భూమి కంపించింది. ఇస్లామాబాద్‌తో పాటు పాక్ ఉత్తర భాగంలో ప్రకంపనలు సంభవించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్…
Heart Attack: ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో యుక్తవయసులో పలువురు వ్యక్తులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. చివరకు చిన్న పిల్లల్ని కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. డ్రాన్సులు, జిమ్ సెంటర్లలో ఉన్నట్లుండి ఇలా గుండెపోటుకు గురైన పలు సందర్భాలను మనం చూస్తున్నాం. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ మైదానంలోనే మరణించడం విషాదాన్ని నింపింది.
భారత దేశ ప్రజలను ప్రస్తుతం దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పొగమంచు, చలి తీవత్ర పెరుగుతోంది. నేడు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ సహా 20 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలలో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.…