బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవాళ (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు కేంద్రం ప్రకటించింది. కిలో బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆరంభించనున్నారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి భారత్ బ్రాండ్‌తో కూడిన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర సర్కార్ ప్రారంభించబోతుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యం NAFED, NCCF, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని పెద్ద చైన్ రిటైల్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగులు అందుబాటులో ఉంచనున్నారు.
Read Also: Health Tips : ఒంట్లో రక్తం తక్కువగా ఉందా? రోజూ ఈ జ్యూస్ ను తాగాల్సిందే..
ఇప్పటికే.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు కూడా భారత్ బ్రాండ్‌తో తక్కువ ధరకు పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాలను విక్రయించింది. ఇందులో భారత్ గోధుమ పిండిని 6 నవంబర్ 2023న కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీంతో దేశంలో సగటు పిండి ధర కిలో 35 రూపాయలు ఉండగా.. కేంద్రం చొరవతో 27.50 రూపాయలకి లభిస్తుంది. కాగా శనగపప్పును కిలో రూ.60కి దొరుకుతుంది. కాగా.. ఈ-కామర్స్ వేదికల్లో భారత్ బ్రాండ్ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా.. భారత్ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ దొరుకుతుందని సెంట్రల్ సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా.. భారత్ రైస్ తో సామాన్యులకు లాభం చేకూరనుంది.