దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఎంబీబీఎస్ (MBBS Student) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (23) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని MBBS చివరి సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ మాత్రం దొరకలేదని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి మృతురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబం యొక్క గోపత్యను గౌరవించేలా విద్యార్థిని పేరు తెలియపర్చడం లేదని పేర్కొన్నారు.
బాధితురాలి కుటుంబం ఢిల్లీలోనే నివాసం ఉంటుంది. ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి అదే రోజు హాస్టల్‌కు తిరిగి వచ్చేసిందని ఖాకీలు తెలిపారు. అదే రోజు స్నేహితులతో కలిసి భోజనం చేసి గదికి వచ్చేసింది. సోమవారం ఉదయం ఆమె గది తలుపు స్నేహితులు ఎన్ని సార్లు కొట్టినా స్పందన కల్పించలేదు. దీంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించడంతో హాస్టల్ గదికి చేరుకుని తలుపు పగలగొట్టగా విద్యార్థిని మృతదేహాం వేలాడుతూ కనిపించింది. ప్రస్తుతానికి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.