Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ మేయర్ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బ్యాలెట్ పేపర్లను తారుమారు చేసి బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పంజాబ్- హర్యానా హైకోర్టులో ఈ ఫలితాలపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేసింది. కానీ, పిల్ ను జస్టిస్ సుధీర్ సింగ్, జస్టిస్ హర్ష్ బంగర్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.
Read Also: Paytm : పేటీఎం ఖేల్ ఖతం.. రూ.20500కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
దీంతో పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. మేయర్ ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి రికార్డును సీల్ చేసి.. మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టకుండా నిషేధించి.. మొత్తం ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్‌లో పేర్కొనింది. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
Read Also: Tirumala: ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు.. తిరుపతిని కూడా తిరుమల తరహాలో..!
అయితే, మేయర్ అభ్యర్థి కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ విషయాన్ని ప్రస్తావించి వెంటనే విచారణ జరపాలని అభ్యర్థించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మూడు పదవులను నిలబెట్టుకుంది. ఇక, ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్-ఆప్ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. 35 మంది సభ్యుల చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్- ఆప్ లు తమ కూటమి సులభంగా విజయం సాధిస్తాయని అంచనా వేశాయి. అయితే, మంగళవారం జరిగిన మేయర్ ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా 16 ఓట్లు రాగా, ఆప్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. ఎనిమిది ఓట్లు రద్దయ్యాయి. కూటమి అభ్యర్థికి వేసిన ఓట్లను రద్దు చేశారని ఆప్ ఆరోపించింది. సభలో ఆప్- కాంగ్రెస్‌లకు 20 మంది కౌన్సిలర్లు ఉండగా, బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు, ఒక ఎంపీ ఉండటం గమనార్హం. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?