Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది.. కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నడుస్తాయా అనేది తేలాల్సి ఉండగా.. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొత్తులపై చంద్రబాబుతో మంతనాలు జరపనున్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు.
Read Also: AP Budget: నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. సభలో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్‌కు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతలు సూచించినట్లు సమాచారం. బీజేపీతో టీడీపీ పొత్తు కుదురుతుందా అనే అంశంపై ఇవాళ క్లారిటీ రానుంది.