Light Rain Expected in Delhi Today: ఈ శీతాకాలంలో భారత దేశం అంతటా ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 5.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది ఈ సీజన్ సగటు కంటే రెండు నాచులు తక్కువగా ఉంది. ఇక ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల…
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది.
Gurugram: ఇండియాలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఢిల్లీ సమీపంలో 865 మిలియన్ డాలర్లతో చేపడుతున్న లగ్జరీ హోమ్స్ నిర్మాణం ప్రారంభం కాకముందే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ ప్రాంతంలో 1,113 విలాసవంతమైన నివాసాలను విక్రయించింది. డీఎల్ఎఫ్ ప్రివానా సౌత్ ప్రాజెక్టులోని ఏడు టవర్లను నిర్మిస్తోంది. ఇందులో ఫోర్-బెడ్రూనం నివాసాలు, పెంట్ హౌజ్ యూనిట్లు అమ్ముడైనట్లు డెవలపర్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపారు.
Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్‌లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు…
Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమిళనాడులోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ, పునరుద్ధరణ, పునరావాస పనులు చేపట్టేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు.
జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది.
YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. టీచింగ్ బ్లాక్‌లో ఇవాళ తెల్లవారుజామున ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.