AP Woman racked up Rs 6 lakh bill at Delhi hotel: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో బస చేసి.. బిల్లు కట్టే సమయంలో మోసం చేసింది. హోటల్లో బిల్లు దాదాపు రూ. 6 లక్షలు కాగా.. యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది. ఇది తెలుసుకున్న హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే…
Heavy Fog in Delhi Today: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు ప్రాంతాలలో విజిబిలిటీ (దృశ్యమానత) దాదాపు సున్నాకి పడిపోయింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వాయు కాలుష్యానికి పొగమంచు కూడా తోడవ్వడంతో ఢిల్లీ జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఉదయం 10-11 గంటలకైనా సూర్యుడి కనిపించడం లేదు. మరోవైపు నేడు, రేపు రాజధానిలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.…
ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్‌తో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.. కర్తవ్య పథ్ లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని తెలిపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్ కల్యాణ్‌తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
Telangana Shakatam: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు సమాయత్తమవుతున్నాయి.