బీజేపీ ప్రభుత్వం (BJP Government) పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోడీ (PM Modi) అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో (Parliament) ప్రధాని మోడీ ప్రసంగించారు. మా పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని.. దీంతో దేశ వ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎంపీలంతా తమ జీతాలను బాధిత కుటుంబాలకు అందజేశారని గుర్తుచేశారు. జీ 20 సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు. కొత్త పార్లమెంట్‌ను నిర్మించుకున్నామని.. ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ వెల్లడించారు.
ఉగ్రవాద నిర్మూలనకు చర్యలకు తీసుకోవడం వల్ల కాశ్మీర్‌లో ప్రస్తుతం శాంతి కనిపిస్తోందని తెలిపారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగలేదని చెప్పుకొచ్చారు.
కొత్త పార్లమెంటు భవనం కావాలని అందరూ చర్చించుకునేవారని.. కానీ గతంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పుడు కొత్త భవనాన్ని నిర్మించుకున్నామని.. అంతేకాకుండా ఈ సమావేశాల్లో అనేకమైన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నామని మోడీ స్పష్టం చేశారు.
#WATCH | PM Narendra Modi speaks on the New Parliament building.
"Everyone used to discuss that there should be a new building of the Parliament. But no decision used to be taken. It was your (Lok Sabha Speaker) leadership that decided this, too matters forward, held meetings… pic.twitter.com/Hi6UzmfW2X
— ANI (@ANI) February 10, 2024
PM Modi says, "India received the opportunity of G20 presidency. India received a great honour. Every state of the country displayed India's capability and their own identity before the world. Its impact continues on the mind of the world even to this day." pic.twitter.com/npGb2zhp01
— ANI (@ANI) February 10, 2024