ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వ (PM Modi) చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జనవరి 31న చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు తాయిలాలు ఉంటాయని అంతా భావించారు గానీ.. అలాంటి ఊసేలేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసింది.
ఇకపోతే ఈ చివరి సమావేశాల్లో అనేక బిల్లులను మోడీ సర్కార్ ఆమోదించింది. ప్రధానంగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేశారు. అలాగే పలు బిల్లులను ఆమోదించారు.
సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై అమిత్‌షా మాట్లాడారు. ప్రధాని మోడీ కూడా సభనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. సమావేశాల ముగింపు సందర్భంగా ఓంబిర్లా మాట్లాడుతూ.. అధికార, విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఇక త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మరోసారి కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి రాబోతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమి కూడా అధికారం కోసం కృషి చేస్తోంది. మరీ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో వేచి చూడాలి.