ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం చేరుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.
PM Modi: ట్రక్, టాక్సీ డ్రైవర్లకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో మాట్లాడారు. ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ధి చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరుచు చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే…
Delhi Crime: సోషల్ మీడియా పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. యువతులను టార్గెట్ చేస్తూ కొందరు వల విసురుతున్నారు. దీంట్లో ట్రాప్ అయిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలియడం లేదు వారికి. సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ పేరిట పరిచయం పెంచుకుని, ఆ తర్వాత పార్టీలకు, పబ్బులకు ఆహ్వానించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. ఓ మహిళా కేంద్రమంత్రిగా ఆమె ఒక మైలురాయిని సాధించబోతున్నారు. గురువారం (ఫిబ్రవరి 1, 2024) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో దేశ చరిత్రలోనే ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు.
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్‌కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.