Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఒకట్రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై చర్చల కోసం ఎన్డీయే భాగస్వామ్యపక్షం జనసేనను బీజేపీ అగ్రనాయకత్వం పిలిచే అవకాశం ఉంది. బహుశా, సోమవారం ఢిల్లీలో బీజేపీ, జనసేనలు పొత్తులపై చర్చలు జరిపే అవకాశం ఉంది. పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై బీజేపీ, జనసేన పార్టీలు ఓ అవగాహనకు రానున్నట్లు సమాచారం.
Read Also: Jani Master: పవన్ కళ్యాణ్ జోలికి వస్తే పీర్ల పండుగే.. జానీ మాస్టర్ ఫైర్
టీడీపీతో పొత్తుల అంశంపై కూడా బీజేపీ, జనసేన నేతలు చర్చించే అనకాశం ఉంది. సోమ లేదా మంగళవారం రోజున పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తులపై మాత్రమే కాకుండా భవిష్యత్‌లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా పవన్‌తో పార్టీ పెద్దలు చర్చించనున్నారని సమాచారం. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.