దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ విద్యాకుసుమం నేలరాలింది. ఎంబీబీఎస్ (MBBS Student) చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (23) ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
బియ్యం ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇవాళ (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు కేంద్రం ప్రకటించింది. కిలో బియ్యాన్ని కేవలం 29 రూపాయలకే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఆరంభించనున్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి..
బియ్యం ధర తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్‌ను ప్రారంభించనట్లు ప్రకటించింది. కిలో బియ్యాన్ని రూ.29కే కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి భారత్ బ్రాండ్‌తో కూడిన భారత్ రైస్ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల…
Woman Robs Own Home: ఢిల్లీకి చెందిన ఓ మహిళ సొంతింటికే కన్నం పెట్టింది. బురఖా ధరించి సొంత ఇంటిలో పెళ్లి కోసం ఉంచిన నగలను దోచింది. 31 ఏళ్ల యువతి ఇంట్లోకి చొరబడి నగలు, నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జనవరి 30న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని సేవర్ పార్క్‌లోని ఇంట్లో జరిగింది. దీనిపై ఇంటి యజమాని కమలేష్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం…
ఢిల్లీ కేంద్రంగా బీజేపీ-ఆప్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ లోటస్-2.0’ అంటూ ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ తాజాగా కౌంటర్ ఇచ్చింది.
పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.