Delhi On High Alert: దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వేడుకల్లో అశాంతిని సృష్టించేందుకు, అలజడి రేపేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు, దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ జారీ అయింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.
దేశరాజధానిలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌పై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకుడిని జుట్టు పట్టుకుని కారు లోపలికి పోలీసులు నెట్టేశారు. స్థానికంగా గుమిగూడిన మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కారు లోపలికి తోసేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం రిఫ్రిజిరేటర్లో లభించింది. ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకుని ఫ్రిజ్‌లోని మృతదేహాన్ని బయటకు తీశారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై బలంవంతంగా నోట్లో యాసిడ్ పోసిన ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ఓకిరాతకు మైనర్‌పై అత్యాచారం చేసి, తన గురించి ఎవరికి చెప్పకుండా ఉండటానికి ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో బాధితు రాలిని విషమంగా మారింది. అక్కడే వున్నవారు గమనించి ఆమెను హుటాహటిన ఆసుత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని చికిత్స…
సోనియా గాంధీ పర్సనల్ సెక్రెటరీపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభాలకు గురుచేసి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు 71 ఏళ్ల పీపీ మాధవన్‌పై అత్యాచారం అభియోగాలు మోపారు పోలీసులు
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేశారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై, వివాదాస్పద సాధువు యతి నరసింహానందపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వారి వ్యాఖ్యలను చూసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తనపై నమోదైన ఎఫ్ఐఆర్, ఢిల్లీ పోలీసుల గురించి అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో…
కొన్ని రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో భాజపా జాతీయ అధికారి ప్రతినిధి నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర దుమారానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన భాజపా.. నుపుర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత నుపుర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా తెలిపారు.…
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన దిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే పంజాబ్ సిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు…