Delhi Court : గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడికి పెళ్లి అయిన వెంటనే పెద్ద షాక్ తగిలింది. ఈరోజు అంటే మార్చి 13న ఆయన తన ఇంటికి వెళ్లలేరు. ఢిల్లీలోని ద్వారకా కోర్టు గృహ ప్రవేశం కోసం కాలా జాతేడి కస్టడీ పెరోల్‌ను రద్దు చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తమ ముందు విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కి ఇప్పటికీ 5 సార్లు సమన్లు పంపింది, అయితే వీటన్నింటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ రోస్ ఎవెన్యూకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు ఈరోజు.. సీఎం కేజ్రీవాల్ ఈడీ 5 సమన్లను ఎందుకు దాటవేశారనే దానిపై ఫిబ్రవరి…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ పట్టు బిగిస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన 5 సమన్లపై ఆప్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది.
Land for jobs scam: బీహార్ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూతో పాటు ఆయన కుమార్తె హేమా యాదవ్‌ని ఫిబ్రవరి 9న తమ ముందు హాజరుకావాలని శనివారం ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్’లో వీరందరికి సమస్లు వచ్చాయి.
Parliament Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన నిందితులకు మరో 15 రోజుల పాటు అంటే జనవరి 5 వరకు పోలీస్ కస్టడీ పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. స్పెషల్ జడ్జ్ హర్దీప్ కౌర్ నిందితులు కస్టడీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవీల కస్టడీని పెంచాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు మరో 15 రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Accused Turned Advocate in UP: నిజం జీవితంలో అసాధ్యమనిపించే సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. పలు సినిమాల్లో చేయని నేరానికి చిన్న వయసులో జైలుకు వెళ్లిన హీరోలు బాగా చదివి పట్టభద్రులై బయటకు వచ్చే సన్నివేశాలు చాలనే చూశాం. లా చదివి తమ కేసు తామే వాదించుకుని నిర్దోషిగా బయటకు వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో ఇది అసాధ్యమనే చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇది సాధ్యమేనని చూపించాడు ఓ యువకుడు.…
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.