2008లో జరిగిన ఢిల్లీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు బుధవారం దోషులుగా నిర్ధారించింది. హెడ్‌లైన్స్ టుడే న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పనిచేసిన విశ్వనాథన్, సెప్టెంబర్ 2008లో ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా ఆమె కారులోనే కాల్చి చంపబడ్డారు.
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు.
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.
దేశంలోని అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు తనపై మోపిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు ఢిల్లీలోని కోర్టు సమన్లు జారీ చేసింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర…
Serial Killer: మైనర్ బాలికలను హత్య చేసి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సైకోకిల్లర్ రవీంద్ర కుమార్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2008 నుంచి 2015 మధ్య కాలంలో 30 మంది చిన్నారులను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో రవీందర్ ప్రమేయం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.