ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. తీహార్ జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించాలి రౌస్ అవెన్యూ కోర్టు జైలు అధికారులను మరోసారి ఆదేశించింది. కొన్ని వస్తువులను స్వయంగా సమకూర్చుకునేందుకు కూడా ధర్మాసనం అవకాశం కల్పించింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులతో పాటు మెడిటేషన్ చేసుకునేందుకు.. ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు ధరించేందుకు, లేసులు లేని బూట్లుకు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Josh Butler: పేరు మార్చుకున్న స్టార్ క్రికెటర్.. ఇక నుంచి ఏమని పిలువాలంటే..!
మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ జైలు అధికారులు అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి స్పష్టంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Niharika: రాహుల్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ.. ఆ విషయం బయటపెట్టిన నిహారిక
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ వేశారు. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈడీ తరపున న్యాయవాదులు-కవిత తరపున న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ఇక ఈడీ రిప్లై రిజాయిన్డర్‌కు కవిత తరపు లాయర్ సమయం కోరారు. ఏప్రిల్ 3 సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని కవిత తరపు న్యాయవాదులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jupudi Prabhakar Rao: పేదవాడికి చట్ట సభల్లోకి వచ్చే అర్హత లేదా చంద్రబాబు?
తన కుమారులకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కవిత కోరారు. దీంతో న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. కవిత బెయిల్‌పై ఈడీ తన సమాధానం ఇచ్చింది. మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్‌పై రెండింటికీ ఈడీ తన వాదనలు వినిపించింది. ఇక కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎలాంటి బెయిల్ కావాలని కోరుకుంటున్నారో.. తేల్చుకోవాలని అభిషేక్ సింఘ్వీకి న్యాయస్థానం సూచించింది. విచారణను కోర్టు ఏప్రిల్ 4కు వాయిదా వేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్‌లో ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి కోర్టులో హాజరపరచగా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వడంతో కవితను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం కవిత ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి