ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మనీలాండరింగ్ కేసులో ఊరట దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది.
ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మెడికల్ పరీక్షల కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తనతో చేరేందుకు తన భార్యను అనుమతించాల్సిందిగా అభ్యర్థించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసు విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కూడా కోర్టుకు చేరుకున్నారు.
ఐదుగురు మహిళా రెజ్లర్లను వేధించినందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ కోర్టు శుక్రవారం లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసింది. రూస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. Also read: Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది.. భారతీయ చట్టాలలోని బాధితురాలు సంబంధించి సెక్షన్లు 354, 354A (లైంగిక…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. తీహార్ జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించాలి రౌస్ అవెన్యూ కోర్టు జైలు అధికారులను మరోసారి ఆదేశించింది.