Accused Turned Advocate in UP: నిజం జీవితంలో అసాధ్యమనిపించే సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. పలు సినిమాల్లో చేయని నేరానికి చిన్న వయసులో జైలుకు వెళ్లిన హీరోలు బాగా చదివి పట్టభద్రులై బయటకు వచ్చే సన్నివేశాలు చాలనే చూశాం. లా చదివి తమ కేసు తామే వాదించుకుని నిర్దోషిగా బయటకు వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో ఇది అసాధ్యమనే చెప్పాలి. కానీ నిజ జీవితంలోనూ ఇది సాధ్యమేనని చూపించాడు ఓ యువకుడు. 18 ఏళ్ల వయసులో చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఓ యువకుడు న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై తన కేసు తానే వాదించుకుని నిర్దొషిగా బయటకు వచ్చాడు. తాను మాత్రమే కాదు తనతోపాటు ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన మరో 13 మందిని శిక్ష నుంచి తప్పించాడు.
Also Read: Telangana CM: డ్రగ్స్ నిర్మూలన కోసం ఎవరు కాంప్రమైజ్ కావొద్దు.. రాష్ట్రంలో ఆ మాట వినపడొద్దు..
అచ్చం రీల్ స్టోరీని తలపిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌదరి రియల్ స్టోరి ఇది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ మేరఠ్ నగరంలో 12 సంవత్సరాల క్రితం క్రిషన్ పాల్, అమిత్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యకు గురయ్యారు. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆ కేసులో నిందితులను తక్షణం అరెస్టు చేయాలని నాటి యూపీ సీఎం మాయావతి పోలీసులను ఆదేశించడంతో హడావుడిగా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో చాలా మంది అన్యాయంగా కేసులో ఇరుక్కున్న వారే ఉన్నారు. వారిలో అమిత్ చౌదరి కూడా ఉన్నాడు. అప్పుడు అమిత్ చౌదరి వయసు 18 ఏళ్లు మాత్రమే. ఈ కేసులో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన అమిత్ 2013లో బెయిల్‌పై బయటకు వచ్చాడు.
Also Read: Big Breaking: రైతు బంధు నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
వెంటనే న్యాయ విద్యలో చేరాడు. బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం చదివాడు. బార్ కౌన్సిల్ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం తన కేసును తానే వాదించుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఈ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని రుజువైంది. ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిస్తూ అమిత్ చౌదరితో పాటు మరో 13 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో, సుమిత్ కైల్, నీతూ, ధర్మేంద్రలను అసలు దోషులుగా కోర్టు నిర్ధారించింది. అయితే వీరిలో సుమిత్ కైల్ 2013లో ఓ ఎన్‌కౌంటర్లో మ’తి చెందగా. యాడు. ధర్మేంద్ర క్యాన్సర్‌తో మరణించాడు. ఇక నీతూకు మాత్రం కోర్టు యావజ్జీవం శిక్షతో పాటు 20 వేల జరిమానా విధించింది.