Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్ధి, ఢిల్లీ ట్రయల్ కోర్టు జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. కోర్టు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రూ. 20,000 వ్యక్తిగత బాండ్‌పై, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ మధ్యంతర…
తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్‌లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్‌గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు.
Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఇతర ప్రతిపాదిత నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన చార్జ్‌షీట్‌పై కోర్టు వాదనలు వినేందుకు ఇచ్చినవిగా పేర్కొంది. Read Also: Vivo Y19 5G: రూ.10,499…
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ…
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
MLC Kavitha: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతుంది. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరు కానున్నారు.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది.