ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.
Delhi Court: పోలీసు హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను ఎవరినైనా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు రుజువు చేయడానికి ఎటువంటి సాక్ష్యాలను చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ దశలో బెయిల్‌పై విడుదల చేయడం సరికాదని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్ మిశ్రా బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు
Actor Jacqueline Fernandez's Pre-Arrest Bail Extended Till Tuesday: బాలీవుడ్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ ప్రి అరెస్ట్ బెయిల్‌ను మంగళవారం వరకు పొడగించింది ఢిల్లీ కోర్టు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు కూడా ప్రమేయం ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో గతంలో జాక్వెలిన్ కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా…