ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుందని, అద్భుతమైన అభివృద్ధి జరగబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నాం అని, ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందన్నారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. గురువారం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల అంశంపై చర్చ జరగనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం కోరనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో…
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు యూఎస్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్‌పై అవగాహన ఒప్పందం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. వివిధ శాఖల సమీక్షలో బడ్జెట్‌పై ఆర్ధిక శాఖ కసరత్తు చేయనుంది. సీఎం చంద్రబాబు సూచనలతో సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనుంది.…
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని అన్ని అధికారులతో సమావేశం నిర్వహించింది.
Delhi CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోతోంది. దశాబ్ధకాలంగా ఉన్న ఆప్ అధికారానికి తెరిదించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా సత్తా చాటలేకపోయింది. 67 స్థానాల్లో దారుణంగా డిపాజిట్ కోల్పోయింది.
Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Parvesh Varma: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అగ్రనేతల్ని ఓడించి మరీ ఢిల్లీని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 చోట్ల బీజేపీ, 22 చోట్ల ఆప్ విజయం దాదాపు గా ఖరారైంది.
Atishi Marlena: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని బీజేపీ పార్టీకి సంబంధించిన గూండాలే చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయని.. ఈ దాడి బాధ్యులుగా రోహిత్ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తుల…
CM Atishi: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్రౌడ్ ఫండింగ్ అవసరమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.40 లక్షలు అవసరమని.. అందుకోసం, రూ.100 నుండి రూ. 1000 వరకు ప్రజలు సహాయం చేయాలనీ కోరారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇది మాకు సహాయపడుతుందని తెలిపారు. నా క్రౌడ్ ఫండింగ్ ప్రచారానికి మద్దతు ఇవ్వండని, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు తీసుకోబోమని అతిషి…