DRDO- Telangana Govt Mou: రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది.
భారత నావికాదళం త్వరలో కొత్త వ్యూహాత్మక ఆయుధం, స్వదేశీ మైన్ కౌంటర్ మెజర్ వెసల్స్ (MCMVs) ను పొందే అవకాశం ఉంది. నీటి అడుగున దాగి ఉన్న శత్రువుల ల్యాండ్‌మైన్‌లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం కలిగిన 12 నౌకలను రూ.44,000 కోట్ల వ్యయంతో తయారు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని.. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని. ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించినట్లు వెల్లడించారు. సైన్యం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చామన్నారు. కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని చెప్పారు.…
జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో పాకిస్థాన్ చేసిన బహుళ క్షిపణి, డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ను భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. ఇస్లామాబాద్‌తో పాటు లాహోర్, సియాల్‌కోట్, కరాచీలో దాడులు నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా ఈ అంశంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "ఈరోజు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి.…
ఆపరేషన్ సిందూర్ విజయం ప్రశంసనీయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సాయుధ దళాలు నిన్న తీసుకున్న చర్యకు, వారు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన రక్షణ మంత్రి పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మన దళాలు ధ్వంసం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. 'ఆపరేషన్ సిందూర్' ఖచ్చితత్వంతో నిర్వహించారన్నారు.
విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు…
Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) గ్రూప్ C పోస్టుల నియామక ప్రకటనను జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక బేస్ వర్క్‌షాప్స్, స్టాటిక్ వర్క్‌షాప్స్‌లో మొత్తం 625 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ గ్రూప్ C పోస్టుల ద్వారా అర్హతగల అభ్యర్థులకు భారత సైనిక దళంలో పని…
India: డ్రాగన్ కంట్రీ చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్‌పై భారత్ నిన్న (శుక్రవారం) ప్రాథమిక పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది.
దేశ రక్షణ శక్తి నిరంతరం బలపడుతోంది. దీంతో.. రక్షణ శాఖ రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నుంచి సుఖోయ్-30 విమానాలకు సంబంధించిన 240 ఏఎల్-31 ఎఫ్‌పీ ఏరో ఇంజిన్‌ల కొనుగోలుకు రూ.26 వేల కోట్లతో ఒప్పందం కుదిరింది. రక్షణ మంత్రిత్వ శాఖ, హెచ్‌ఏఎల్ సీనియర్ అధికారులు సోమవారం ఒప్పందంపై సంతకం చేశారు.