DRDO- Telangana Govt Mou: రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది. రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ప్రతిగా.. శామీర్ పేట్ లో భూములను తెలంగాణ సర్కార్ ఇవ్వనుంది. కాసేపట్లో రక్షణ శాఖతో MoU చేసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములను కేంద్ర రక్షణ శాఖ ఇవ్వనుంది. రక్షణ శాఖ భూముల కారణంగా లేట్ అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు.. ఈ ఒప్పందం పూర్తయితే ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత స్పీడ్ కానున్నాయి.
Read Also: Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల స్కామ్..
అయితే, స్టేట్ హైవే- 1 పై జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ తో పాటు నేషనల్ హైవే- 44 పై ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇక, కేంద్ర రక్షణ శాఖ ఇచ్చే భూములకు ప్రతిగా శామీర్ పేట్ లో ల్యాండ్స్ ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం.