India: డ్రాగన్ కంట్రీ చైనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్‌పై భారత్ నిన్న (శుక్రవారం) ప్రాథమిక పరీక్షలు చేసింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శనను చాటిందని రక్షణ మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల లక్ష్యాలన్నీ నెరవేరాయని పేర్కొనింది. జొరావర్ ట్యాంకు బరువు 25 టన్నులు ఉంటుంది. దీన్ని వాయు మార్గంలోనూ తరలించొచ్చు అని తెలిపింది. చైనా వెంబడి ఉన్న సరిహద్దుల్లో వేగంగా మోహరించేందుకు దీన్ని తయారు చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), ఎల్ అండ్ టీ డిఫెన్స్ సంస్థలు ఈ ట్యాంకును డెవలప్ చేశాయి.
Read Also: Samsung Galaxy M05 Price: 50ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ.. 8 వేలకే శాంసంగ్ మొబైల్!
అయితే, ప్రాథమిక పరీక్షల్లో తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్ ఫైరింగ్ సామర్థ్యాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. అవసరమైన కచ్చితత్వాన్ని ఇది ప్రదర్శించిందని అధికారులు చెప్పుకొచ్చారు. పర్వతమయంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో 350కి పైగా తేలికపాటి ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం అనుకుంటుంది. డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది. ఈ ట్యాంకుల ద్వారా చైనాకు చెక్ పెట్టొచ్చు అని ఇండియన్ ఆర్మీ భావిస్తుంది.