Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) గ్రూప్ C పోస్టుల నియామక ప్రకటనను జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక బేస్ వర్క్‌షాప్స్, స్టాటిక్ వర్క్‌షాప్స్‌లో మొత్తం 625 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ గ్రూప్ C పోస్టుల ద్వారా అర్హతగల అభ్యర్థులకు భారత సైనిక దళంలో పని చేసే ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా తమ దరఖాస్తులను అందించవచ్చు. దరఖాస్తులను ఉద్యోగాల ప్రకటన వెలువడిన 21 రోజులలోగా నిర్దేశిత చిరునామాకు పంపాలి. ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుంది.
Also Read: Revanth Reddy On Rythu Bharosa: రైతు భరోసాపై సందేహాలు అవసరం లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ ఉద్యోగ నియమపక ప్రక్రియలో భాగంగా వివిధ పోస్టులలో ఎలక్ట్రిషియన్, టెలికాం మెకానిక్, ఫార్మసిస్ట్, ఫైర్‌మన్, లోవర్ డివిజన్ క్లర్క్ (LDC), ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్స్‌మెన్ మేట్, వాహన మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్, స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులు వివిధ ప్రాంతాల్లోని సైనిక వర్క్‌షాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు విద్యార్హతల పరంగా భిన్నంగా ఉంటాయి. కొన్ని పోస్టులకు ITI సర్టిఫికెట్‌లు, 12వ తరగతి పాస్, డిప్లొమాలు ఇలా వివిధ ప్రత్యేక రంగాలలో డిగ్రీలు అవసరం. సాంకేతిక పోస్టుల కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్ (NCTVT) సర్టిఫికేట్, సంబంధిత పోస్టులో అనుభవం కూడా అవసరం.
భారత సైనిక డీజీ ఈఎమ్ఈ గ్రూప్ C 2024 నియామక ప్రక్రియలో రెండు దశల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇందులో మొదటగా రాత పరీక్షలో OMR షీట్ ఆధారంగా రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానం ఇచ్చిన ప్రతీ ప్రశ్నకు 0.25 మార్కులు కట్ చేయబడతాయి. ఆ తర్వాత శరీర ధారుడ్య పరీక్ష, ఇంకా డాక్యుమెంట్ వేరిఫికేషన్ ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శరీర పరీక్ష, మెడికల్ పరీక్ష ఆ తర్వాత డాక్యుమెంట్ వేరిఫికేషన్‌కు హాజరుకావాలి. భారత సైన్యం గ్రూప్ C నియామకాల ద్వారా పోస్ట్ ఆధారంగా 7వ పే కమిషన్ ప్రకారం వేతనం నిర్ణయించబడుతుంది. మెడికల్, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), డియార్నెస్ అలవెన్స్ (DA) ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా అందజేయబడతాయి.
Also Read: Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆఫ్లైన్‌లో గడువు తేదీలోగా తమ దరఖాస్తులను అధికారిక చిరునామాకు పంపాలి. దరఖాస్తు ప్రక్రియలో కొన్ని ప్రత్యేక సూచనలు ఉంటాయి. దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఆఫ్లైన్‌లో జమ చేయాలి. భారత సైనిక డీజీ ఈఎమ్ఈ గ్రూప్ C 2024 నియామకాలు భారతదేశంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.