సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు.
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన…
జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.
అమ్మా అని పిలుస్తూ 12 ఏళ్ల బాలుడు అనంత లోకాలకు వెళ్లాడు. 18వ అంతస్తులో ఉన్న బాలుడు బాల్కనీలో నిలబడి కింద ఉన్న తన తల్లిని పిలుస్తున్నాడు.. ఇంతలో తను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు.
రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు తెలియని వారు ఈ రెండు తెలుగు రాష్టాలలో ఎవరూ లేరు. ఆయన ఏది చేసినా కొత్తగానే ఉంటుంది.ఎవరికీ భయపడకుండా తనకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు ఆయనకి ఎలాంటి భావోద్వేగాలు ఉండవని అందరూ కూడా అంటుంటారు. చావు, పుట్టుక వంటి విషయాలపై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.ఆయనకు అస్సలు చావు అంటే ఇష్టం ఉండదని ఎవరైనా చనిపోతే అలా ఏడ్వడం కూడా నచ్చదంటూ కామెంట్ చేశారు.”నా కాలేజ్ ఫ్రెండ్ లో…
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.