CM Yogi: లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది లోకంలో ఉండే నానుడి. కానీ ఉల్లిపాయలు ఇద్దరి లవర్స్ మధ్య తగాదా పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన షాకింగ్ కలిగిస్తోంది.
ఢిల్లీలో దారుణ ఘ్తన చోటు చేసుకుంది.. షాహదారా ప్రాంతంలోని తన ఇంట్లో డబ్బు దొంగిలించడానికి 77 ఏళ్ల అమ్మమ్మను చంపినందుకు 15 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు..ప్రధాన నిందితుడి నుంచి చోరీకి గురైన రూ.14,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం జీటీబీ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంటి మంచంపై వృద్ధురాలు శవమై కనిపించింది.ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయం కనిపించకపోవడంతో…
ఏడాదికి ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరుపుకుంటారో తెలుసు.. ఈ పండగను పేద, ధనిక అని తేడా లేకుండా వారికి ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు.. ఈ సంక్రాంతి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు మంజా తగిలి మరణించాడు.. వీటిలో…
బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదు ఇళ్లు దగ్ధం కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు.
Road Accident: కేరళలోని మలప్పురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శబరిమల యాత్రికులు వెళ్తున్న ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఐదుగురు మృతి చెందారు.
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని…
నేపాల్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం దాటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విపరీతమైన చలిలో వీధుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మంగళవారం ఉదయం మృతిచెందింది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.