జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టారు. దాంతో దావ్నా గ్రామానికి చెందిన దేవ్ కుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి కొట్టి చంపారా.. కాల్చి చంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నక్సలైట్లు మిగిలిన నలుగురిని కూడా కొట్టి చంపారు.
Bhola Shankar: మిల్కీ బ్యూటీ.. అంటూ పాట పాడుతున్న చిరు
మరోవైపు నక్సలైట్లను పట్టుకునేందుకు పోలీసులు సరిహద్దు జిల్లా లతేహార్‌లో నిరంతరం దాడులు చేస్తున్నారు. ఈ ఘటనతో లతేహర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు మూడు రోజులుగా నక్సలైట్లు నిరంతరం గ్రామానికి వస్తున్నారు. దేవ్ కుమార్, బబ్లూ అన్సారీ మరియు మరికొంతమందిని విచారిస్తున్నారు. అయితే గ్రామంలో అందరూ పడుకున్నాక ఈ ఘటనకు పాల్పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. భారీ ఆయుధాలతో నక్సలైట్లు సృష్టించిన ఘటనతో గ్రామస్తుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. అంతేకాకుండా నక్సలైట్లు గ్రామస్తులను బెదిరించడంతో ఈ ఘటనను పోలీసులకు చెప్పేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు.
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
నక్సలైట్ల కోసం జార్ఖండ్ పోలీసులు, CRPF సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై రివార్డులు ఉన్న నక్సలైట్ కమాండర్లను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోలు మృతి చెందడంతో భద్రతా బలగాలపై నక్సలైట్లు ఆగ్రహంతో ఉన్నారు. అయితే మావోలు మాత్రం.. గ్రామస్థులు ఇచ్చిన రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడులు చేస్తున్నారని నక్సలైట్లు భావిస్తున్నారు.