ప్రజా గాయకుడు గద్దర్ కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని రోజులుగా గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే గద్దర్ మరణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Malavika Mohanan : స్విమ్ సూట్ లో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
ప్రజా కవి – గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని సీఎం జగన్ కొనియాడారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని అన్నారు. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఆయన లేరన్న వార్త ఊహించనదని పేర్కొ్న్నారు.
Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం
ఆయన ప్రజల మధ్య లేనప్పటికీ.. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని సీఎం జగన్ అన్నారు. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందని జగన్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.