University Student Death: ప్రభుత్వాలు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసిన ర్యాగింగ్ భూతానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ర్యాగింగ్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలతోపాటు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కమిటీలను ఏర్పాటు చేసి.. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చబుతున్నా ర్యాగింగ్ ఆగడం లేదు. ర్యాగింగ్ మూలంగా జరిగే మరణాలు ఆగడం లేదు. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో జరిగింది. తనకు చాలా భయం వేస్తోందని.. త్వరగా రావాలని వాళ్ల అమ్మకు ఫోన్ చేసిన విద్యార్థి గంటలోనే మరణించడంతో ఆ తల్లి గర్భశోకం చెప్పనలవి కాకుండా పోయింది.
Read also: Viral Video : ఇడ్లీలను ఇలా కూడా తింటారా?.. జనాలను చంపేసేయ్యండి రా బాబు..
కోల్‌కతాలోని జాదవ్‌పుర్ యూనివర్సిటీకి చెందిన 18 ఏళ్ల విద్యార్థి స్వప్నదీప్ తాను మృతి చెందడానికి గంట క్రితం తన తల్లికి ఫోన్ తనకు చాలా భయమేస్తోందని.. త్వరగా రావాలని ఫోన్‌లో చెప్పాడు. తాను వస్తున్నట్టు తల్లి చెప్పింది. బుధవారం రాత్రి స్వప్నదీప్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాడు. కళాశాలకు దాదాపు 100కి.మీ దూరంలోని నదియాలో వాళ్ల అమ్మానాన్న ఉంటారు. ‘అమ్మా నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నా పరిస్థితి ఏం బాగోలేదు. నువ్వు తొందరగా రావా.. నీతో మాట్లాడాలని వాళ్ల అమ్మకు చెప్పాడు. వాళ్ల అమ్మ బయల్దేరుతున్నానని చెప్పింది. అయితే కొద్ది సేపటి తర్వాత ఆమె తిరిగి తన కొడుకుకు కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గంట తర్వాత మీ అబ్బాయి హాస్టల్ బాల్కనీ నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే రండి అంటూ ఎవరో ఫోన్ చేసి చెప్పారని మృతుడి బంధువు ఒకరు మీడియాకు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి హాస్టల్‌లోని రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాల పాలైన కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు.
Read also: Thalapathy68: 23 ఏళ్ల తరువాత విజయ్ సరసన జ్యోతిక..
కుటుంబ సభ్యులు వెళ్లేసరికి మృతదేహాన్ని పూర్తిగా కవర్‌తో కప్పేశారు. విద్యార్థికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో ఓ పేపర్‌పై బొమ్మ వేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు వైద్యులు చూపించారు. విద్యార్థి తండ్రి రామ్‌ప్రసాద్ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతికి హాస్టల్‌లోని కొందరు విద్యార్థుల వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ర్యాగింగ్ కారణంగా నేనొక మిత్రుడ్ని కోల్పోయానంటూ ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి స్నేహితుడొకరు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం.. కుటుంబ సభ్యుల ఆరోపణలకు సపోర్టివ్‌గా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదంటే ఎవరైనా కిందికి తోసేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ పరిసరాల్లో మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ రోజు ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌కు చేరుకున్న పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బాధిత విద్యార్థి తల్లిదండ్రుల్ని పరామర్శించారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.