ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి జకియా ఖానం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం.. కొద్ది గంటల్లోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి పాల్గొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం జకియా ఖానం మాట్లాడుతూ… ‘ప్రధాని న్రరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా అందరినీ…
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్‌లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం…
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తోంది.. అందులో భాగంగా.. ఏపీలో బీజేపీ ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టనుంది.
3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.
రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు.
దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ…
క్షేత్ర స్ధాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని బలోపేతం చేయడంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. 50 రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఏపీలో జిల్లా అధ్యక్షులకు నియామకం పూర్తవడంతో.. ఇక అధ్యక్ష పదవిపై అందరి దృష్టి నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారధి ఉన్నారని తెలుస్తోంది. అయితే అధ్యక్ష రేసుపై…
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా అడ్డురి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు ధ్రువీకరించారు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా.. పార్టీని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పని తీరును పార్టీ గుర్తించింది. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పార్టీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. అడ్డురి శ్రీరామ్ రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ‘బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఓసారి సంస్థాగత ఎన్నికలు…
ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. విజయవాడని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల బీజేపీ…