Daggubati Purandeswari: బీజేపీ పార్టీ పురందేశ్వరికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం. ఒడిశా రాష్ట్రంలో పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒడిశా రాష్ట్రంలో ఇంఛార్జుగా ఉన్న పురందేశ్వరిని సహ ఇంఛార్జికి పరిమితం చేసింది. పురందేశ్వరీ వ్యవహార శైలిపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు.. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ బాధ్యతల…
తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు పలువురు పాల్గొంటున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చీఫ్ జస్టిస్ రమణతో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని ఎన్టీఆర్ వీరాభిమాని టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్ ఎన్టీఆర్ రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ‘తిరుపతి అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే కూడా అంతే…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందన్నారు.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకుని రావాలని చూడ్డం శోచనీయమన్న ఆమె.. వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను ఆధారంగా చేసుకుని అప్పులకు వెళ్తున్నారని విమర్శించారు.. ఉన్న ఆస్తులను అమ్ముకోవడం చూస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని అర్ధం…
ఏపీలో 13 జిల్లాలను విభజిస్తూ కొత్తగా మరో 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాను రెండు భాగాలుగా విభజించి విజయవాడ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటివరకు టీడీపీ నేతలు, నందమూరి వారసులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు. Read Also: కాణిపాకం ఆలయంలో దారుణం.. పాత రథచక్రాలకు నిప్పు పెట్టిన…
ఉప్పు..నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాల మధ్య రెండున్నర దశాబ్దాలుగా సఖ్యత లేదు. పేరుకు తోడల్లుళ్లు అయినా.. ఎవరి రాజకీయం వారిదే. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. ఇటీవలే ఆ ఇద్దరు ఓ కార్యక్రమంలో కలుసుకుని.. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. సంక్రాంతి పండక్కి చాలాఏళ్ల తర్వాత ఓ అక్క ఇంటికి తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడి సందడి సంక్రాంతికే పరిమితమా.. లేక ఇద్దరు బావలను కలపటం కోసమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి…
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుబట్టారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని తెలిపారు. అక్కాచెల్లెళ్లుగా తామిద్దరం ఎన్నో విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు. Read Also: పదవి…
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు. తాజాగా బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీ రఘురామకృష్ణరాజు ను అరెస్టును ఖండించారు. ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను…