దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ వాసుపల్లి సంతోష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై స్పందించారు. ‘బీజేపీలో చేరేందుకు అన్ని జిల్లాల నుంచి నాయకత్వం రెడీగా ఉంది. దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించింది. ఢిల్లీలో బీజేపీ గెలుపు కార్యకర్తల విజయం. ఈ విజయం వాళ్లకు అంకితం. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్య పెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి సుపరిపాలనకు అవకాశం కల్పించారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారు’ అని అన్నారు.
‘ఢిల్లీ, ఏపీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉంది. ఐదేళ్లు విధ్వంసం ద్వారా జేబులు నింపుకున్నారు తప్ప నిజమైన లబ్ధిదారులకు చేరలేదు. అభివృద్ధి కూటమి ద్వారానే సాధ్యం అని నమ్మారు కనుక అనూహ్యమైన ఫలితం సాధ్యం అయ్యింది. పదేళ్లు అధికారంలో వున్న అప్ ను ఢిల్లీ ప్రజలు మోస్తే.. కేజ్రీవాల్ కూడా అవినీతికి అతీతుడు కాదని తేలిపోయింది. అభివృద్ధిని పట్టించుకోనీ అప్ కు గుణ పాఠం చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడుతోంది’ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సంతోషం వ్యక్తం చేశారు.