కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
జెమిలి ఎన్నికలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ జెమిలి ఎన్నికలకు సిఫార్సు చేయడాన్ని అభినందించారు. జెమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు.
రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి అని ఆమె తెలిపారు.
కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు..
Daggubati Purandeswari: నేడు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రైల్వే డి.ఆర్.ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు. 250 కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతాం…
నేడు సచివాలయంలో ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్ఎల్బీసీ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఇసుక అమ్మకాలను రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్ద క్యూ కట్టారు ఇసుక వినియోగదారులు. టన్ను ఇసుక ధర 270 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు చట్టబద్ధమైన పనులు మాత్రమే వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండు లక్షల వరకు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష…
ఏపీ ఎన్నికల తరువాత తొలిసారి ఏపీ బీజేపీ విసృతస్థాయి సమవేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదని, సమావేశం కన్నుల పండువగా ఉందన్నారు. రెండు వేల మంది పాల్గొనడం ఆనందదాయకమని, దేశం లో 140కోట్ల జనభా తో ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు…