Purandeswari: బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. 40 ఏళ్ల పాటు అంతరాయం లేకుండా పార్లమెంటులో ఉన్నారు.. 30 సంవత్సరాలు మంత్రిగా సేవలందించారు.. పీడీఎస్ విధానం ప్రారంభించిన మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ నిలిచారు.. PMAY కింద ఇళ్ళ కేటాయింపులో మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు. 10 మందికి ఉపాధి కల్పించే వారిగా ఎస్సీ, ఎస్టీ కులాల యువతీ యువకుల కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలను మోడీ ప్రారంభించారని పేర్కొనింది. డిక్కీ అనే సంస్ధను ప్రత్యేకంగా దళితుల కోసం ప్రధాని స్టార్ట్ చేశారని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపింది.
Read Also: Rabiya Khatoon : రబియా.. ఖాతూన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్
ఇక, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, పౌరసత్వ బిల్లు లాంటివి చేసింది అని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లు త్వరలో చట్టం అవుతుంది.. అప్రజాస్వామికంగా వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని సోనియా గాంధీ అన్నారు.. సోనియా ఆ సమయంలో రాజ్యసభలో ఉన్నారో లేదో తెలీదు.. రాహుల్, ప్రియాంక కూడా కనిపించలేదని ఎద్దేవా చేసింది. 3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
Read Also: Kamareddy District: లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
అయితే, కోటి 25 లక్షలకు పైగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొనింది. అల్లా మీద విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలకు భూమిని ఇస్తే అది వక్ఫ్ అవుతుంది.. వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారు.. మతపరమైన అంశంలో కేంద్రం ఏమీ చెప్పలేదు.. ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలదూర్చలేదు.. 2013లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు వక్ఫ్ బోర్డును సవరణ చేశారు.. మైనారిటీలలోనే విభజన తీసుకొచ్చేలా 2013లో యూపీఏ ప్రభుత్వం చేసింది అని ఆరోపించారు. 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ కలిగి ఉంది.. రైల్వే, డిఫెన్స్ తరువాత అంత ఎక్కువ భూమి కలిగి ఉన్నది వక్ఫ్ మాత్రమే.. వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూములు సరిగ్గా వినియోగించితే మైనారిటీల ఇబ్బందులు దూరం చేసే అవకాశం ఉందన్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు.. ఆర్టికల్ 14ను అనుసరించే సవరణలు చేశామని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించింది.