ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు.. ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు..
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు.. మూడు గంటలు కావాలా 24 గంటల కరెంట్ కావాలా అని ఆయన ప్రశ్నించారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనున్న కర్ణాటక పరిస్థితులే.. కాంగ్రెస్ అంటేనే ఝూటాకోర్ పార్టీ.. 2009లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అంటూ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లను నమ్మితే మోసపోతాం.. కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోంది.. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం దండగ చేస్తే.. కేసీఆర్ పండుగ జేసిండు అని ఆయన అన్నారు.
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్ల రూపాయలు దోపిడీకి వైసీపీ నేతలు తెర తీశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్ ఖనిజానికి ఇతర దేశాల్లో డిమాండ్ ఉండటంతో వైసిపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు..
ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, సీఎం కేసీఆర్ సెంచరీ చేస్తారు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు.. సుమన్ చెన్నూర్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి గురుంచి ఆలోచిస్తాడు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిదే పెత్తనం ఉంటుంది.. అది కేవలం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దీక్ష చేసే ముందు ఎంత వరకు మన అర్హత ఉందో చూసుకోవాలి అని స్పీకర్ తమ్మనేని సీతారం అన్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపొతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండి.. అది వాళ్ళ ఇష్టం.. తప్పు చేసి మోసం చేయాలని చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఎన్నికలలో ప్రజలు ఊహించనంత తీర్పు ఇస్తారు.