పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా అనే పథకం కాదు వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంటుంది.
నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్న దమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారు..
ప్రజల తరఫున పోరాడితే, నాయకులను జైల్లో పెడుతున్నారు.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు పరోక్షంగా స్పందిస్తూ.. ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ఉంది.. అహంకారం ఉంటే ఏమవుతుంది అనేది తెలంగాణలో చూశాం.. మరో మూడు నెలల్లో ఇక్కడా చూస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
మల్కాజ్ గిరి ఎన్నికల వ్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ వయస్సుకు మించి మాట్లాడుతున్నాడు.. ఇక్కడ మోడీని గూండా అని తిట్టి.. ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పెట్టుకుంటావు.. బీజేపీతో మ్యాచ్ పికెటింగ్ చేసుకున్నారు.
దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తో ప్రయాణం చేసి టీడీపీ, కాంగ్రెస్ లోకి మారారు అని మహమ్మూద్ అలీ ఆరోపించారు. చంద్రబాబును రేవంత్ రెడ్డి మిస్ గైడ్ చేశారు.. కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు ఉన్నారు.. బీఆర్ఎస్ లో మాత్రం ఒక్కరే సీఎం ఉంటారు అని ఆయన చెప్పుకొచ్చారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారు.. మీరు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరింది అని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి.. తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు.. ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.