మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నూరులో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ.. చెన్నూర్ పట్టణంలో రూ.10 కోట్లతో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశామని మంత్రి తెలిపారు. 14 కోట్ల 80 లక్షలతో సుద్దాల బిడ్జ్ ప్రారంభించామన్నారు. ఇక, 55 కోట్ల రూపాయలతో చెన్నూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు హరీశ్ రావు చెప్పారు. చెన్నూరులో గెలిచేది మన బాల్క సుమన్ తమ్ముడే.. చెన్నూర్ లో రెవెన్యూ డివిజన్ దశాబ్దాల కల బాల్క సుమన్ తో సాధ్యమైంది.. కేసీఆర్ కు సుమన్ అంటే బాగా ఇష్టం, సుమన్ ఏది అంటే అది సీఎం ఇస్తారు అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Mega Family: వరుణ్-లావణ్య పెళ్లి వేడుకలు మొదలయ్యాయి… అందరూ ఉన్నారు జనసేనాని తప్ప
ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, సీఎం కేసీఆర్ సెంచరీ చేస్తారు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు.. సుమన్ చెన్నూర్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి గురుంచి ఆలోచిస్తాడు.. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని సొంత రాష్ట్రంలో మీ పార్టీకి దిక్కు లేదు, తెలంగాణలో ఏమి చేస్తావు అని ఆయన విమర్శించారు. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవు, వచ్చే ఎన్నికల్లో కర్ణాటక నుండి డబ్బులు వస్తాయట.. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మారని పార్టీ లేదు, అటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతారా అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Also: India issues advisory: ఇజ్రాయిల్‌లోని భారత పౌరులకు కీలక సూచనలు..
ఛత్తీస్ ఘడ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 600 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నారు.. అలాంటిది తెలంగాణలో పెన్షన్లు ఎలా ఇస్తారు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు అండగా నిలిచింది మన కేసిఆర్, అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు.. చెన్నూర్ అభివృద్ధి ఆగొద్దు అంటే మళ్ళీ బాల్క సుమన్ ను గెలిపించాలి.. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు అనే నినాదం ఉంది.. కాంగ్రెస్ లో సీఎం కుర్చీ కోసం కొట్లాడుతారు.. కాంగ్రెస్ వస్తే మత కల్లోలలు, గొడవలు, కరువులు వస్తాయని హరీశ్ రావు అన్నారు.
Read Also: Israel: “ఆపరేషన్ ఐరన్ స్వార్డ్” ప్రారంభం..మేం యుద్ధంలో ఉన్నామన్న ఇజ్రాయిల్..
సీఎం కేసీఆర్ వృధ్యాప్య పెంచన్లు పెంచే ఆలోచనలో ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాణహిత, గోదావరి నదుల తీర ప్రాంతంలో ప్రక్కన కరకట్టలు కట్టడమా లేదా మునిగిపోయిన రైతుల పంట పొలాలను రీసర్వే చేయుంచి వారికి నష్టపరిహారం ఇస్తాము.. కేసిఆర్ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ హయంలో 3 గంటలు కూడా కరెంట్ లేదు.. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రజలను మళ్ళీ మోసం చెయ్యడానికి వస్తున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు.