మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి జాతీయ జెండా ఇచ్చిన నేల మీద గాంధీ జయంతి చేసుకోవడం నా అదృష్టం అని ఆయన వ్యాఖ్యనించారు.
గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గాంధీని అవమానించేందుకు ఆయన దీక్ష చేస్తున్నారు అంటూ ఆమె మండిపడ్డారు. దీన్ని మేము ఖండిస్తున్నాము.. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలి..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యనించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తెలంగాణ రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించడాన్ని దేవాదాయ శాఖ మంత్రి తప్పు పట్టారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్ట్ చేసి సీఎం జగన్ రెడ్డి భయపడడం సిగ్గుచేటు.. చంద్రబాబుకి దేశ వ్యాప్తంగా వస్తున్న మద్దతు చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలయింది..
దగ్గబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది.. ప్రత్యేక హోదాకు సరిసమానమైన ప్యాకేజీని ఇస్తామంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అని ఆమె పేర్కొన్నారు.
సీతక్క మాట్లాడుతూ.. యువకుల బలిదానాలను గుర్తించి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఆమె పేర్కొన్నారు. లీకేజీల పేరుతో ఉద్యోగుల ప్రశ్న పత్రాలను ప్రభుత్వం అమ్ముకుంటుంది.. గల్లి గల్లికి ఒక వైన్ షాపు, ఇంటింటికి ఒక మద్యం షాపు పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తూ.. యువతను పక్క దారి పట్టిస్తుంది అని సీతక్క తెలిపింది.
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు.
సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్ కు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన అన్నారు. ఈడీ, సీఐడీ ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.. వాటికి ముందు సమాధానం చెప్పు.. 118 కోట్లుకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ మంత్రి సెటైర్ వేశారు.
చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని నాదేండ్ల మనోహార్ అన్నారు.