నెల్లూరు జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్ల రూపాయలు దోపిడీకి వైసీపీ నేతలు తెర తీశారు అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్వార్ట్జ్ ఖనిజానికి ఇతర దేశాల్లో డిమాండ్ ఉండటంతో వైసిపీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారు.. ముఖ్యమంత్రి పాదాల క్రింద గనుల శాఖ నలిగిపోతోంది అని ఆయన మండిపడ్డారు. వేమిరెడ్డి, ఆదాల, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కలిసి జిల్లాను దోచేస్తున్నారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pakistan vs Afghanistan: పాకిస్థాన్‌ను 250 పరుగులు కూడా చేయనివ్వం: అఫ్గాన్ కెప్టెన్
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి బృందం మైనింగ్ వ్యాపారం చేస్తోంది వాస్తవం కాదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వైసిపీ వాళ్లు చేస్తూ టీడీపీ నేతలపై బురద చల్లుతున్నారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. వైసిపీ పాలనలో టీడీపీ నేతలు కనీసం కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోలేకుంటే.. మైన్స్ దోపిడీ సాధ్యమా అని ఆయన అడిగారు. సైదాపురంలో 150 హిటాచీలు, వందల టిపర్లు పని చేస్తున్నాయి.. ఒక్క మైన్ కి కూడా లీజు లేకుండా దోచి స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Read Also: Etala Rajender: కాళేశ్వరం అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే.. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తేలుతుంది…
మైన్స్ దోపిడీ చేసి వచ్చే డబ్బుతో రాబోయే ఎన్నికలు చేయాలని వైసీపీ పార్టీ చూస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. అనిల్ కుమార్ యాదవ్ పిట్టకథలు చెపుతున్నారు.. ఎవరు దోపిడీదారులో అనిల్ కుమార్ రుజువు చేయాలి.. రుజువు చేయలేక పోతే తెలుగు దేశం పార్టీ నేతలపై చేసిన ఆరోపణలకు అనిల్ కుమార్ యాదవ్ క్షమాపణ చెప్పాలి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.