Anurag Thakur: కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకున్నాడు.. కానీ, కవిత వార్తల్లో నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది.. మన టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.. అలాగే, తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్ మెన్ గా నన్ను పంపించారు అని ఆయన పేర్కొన్నారు. ఛతీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎంతో దోచుకుంది.. అవినీతి చేసి కూరుకుపోయింది.. రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికింది.. విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
Read Also: Samantha: రికవరీ కోసం ఆ దారి ఎంచుకున్న సమంత
Also Read
మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు.. మహాదేవ్ యాప్ పేరిట 508 కోట్లు ఛతీస్ గఢ్ సీఎం భూపేష్ భాగేల్ కు అందాయి.. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదు.. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు.. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారు.. పార్లమెంట్ లో సోనియా, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు అని అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు.
Read Also: Himanta Biswa Sarma: “మియా ముస్లింల” ఓట్లు మాకు అవసరం లేదు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు..
10 ఏండ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు.. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు అని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది.. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే.. గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది.. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అంటూ కేంద్రమంత్రి ఠాకూర్ మండిపడ్డారు.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్ అని అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ జరిగిందని అంటున్నారని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు అయితే ఒప్పుకున్నట్లే కదా.. మరి ఎంత అవినీతి జరిగిందో ఆయన తన తండ్రి కేసీఆర్ ను అడిగి చెప్పాలి అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదు.. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచి పెట్టలేదు.. కవితను ఎలా విడిచిపెడతాం..
కాంగ్రెస్.. రామభక్తులపై బుల్లెట్లు దింపింది.. కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా.. దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడు రూమ్స్ ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?