ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. డబ్బే రాజకీయాలలో ప్రాధాన్యం కాదు.. నువ్వేదో పొడుస్తావని నిన్ను పాలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు అని ఆయన విమర్శలు గుప్పించారు. అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలని చూస్తున్నావు.. ఎన్ని డబ్బుల సంచులు తెచ్చావని పాలేరు ప్రజలు నిన్ను గెలిపించారో గుర్తుకు తెచ్చుకో అని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
Read Also: CM Jagan Review: ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్ష
నీ అహంకారం, మదం పట్టిన మాటలు, అధికారంతో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తా అనుకుంటున్నావ్.. బెదిరించి తీసుకెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయ్ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు పేదల ఇంటి ముందుకే వస్తాయన్నారు. మీ ముఖాలకు పరీక్షలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ లో టికెట్ ముందుగానే ప్రకటించడం ఉండదు.. టిక్కెట్టు ఎవరికిచ్చిన అభ్యర్థిని మనం దగ్గరుండి గెలిపించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.
Read Also: No Marriage: పెళ్లికి నో అంటున్న యువత.. కారణాలు ఇవేనా..
కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిదే పెత్తనం ఉంటుంది.. అది కేవలం రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.